ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నడి సముద్రంలో అగ్నిప్రమాదం

national |  Suryaa Desk  | Published : Fri, Dec 01, 2023, 01:22 PM

ఈ మధ్య కాలంలో సముద్రాలలో బోట్లు తగలబడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకొస్తున్నాయి. సాధారణంగా ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగితే భారీగా నీటిని స్ప్రెడ్ చేసి వాటిని ఆపే ప్రయత్నం చేస్తాం.అదే సముద్రంలోనే అగ్నిప్రమాదం జరిగితే వెంటనే ఆర్పేయవచ్చేమో అని భావిస్తాం..! కానీ బయట జరిగే ప్రమాదాల కంటే సముద్రంలో జరిగే ప్రమాదాల్లోనే నష్టం ఎక్కువ జరుగుతుందన విషయం చాలా మందికి తెలియదు.ఇటీవల విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో చోటు చేసుకున్న బోట్ల ప్రమాదం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. బోట్ కింద అనంతమైన సముద్రం ఉన్నా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా అరవై బోట్లు ఏకంగా భగ భగా మండిపోయాయి. కింద ఏకంగా సముద్రం ఉన్నా మంటలు ఆర్పలేకపోయారు. బయటి నుంచి ఫైర్ ఇంజన్‌లు వచ్చి బయట ప్రాంతాల్లో కంటే ఎక్కువగా శ్రమిస్తే తప్ప భారీ నష్టం తర్వాత మంటలు అదుపులోకి రాలేదు. ఈ సంఘటనను ఇంకా మరువక ముందే ఈరోజు కాకినాడ సముద్రంలో మరో ప్రమాదం జరిగింది.


అది కాకినాడ – భైరవ పాలెంకు మధ్యలో తీరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న డీప్ సీ. చేపల వేట కోసం ఈ తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కాకినాడకు చెందిన మత్స్యకారుడు జానకి రామ్‌కు చెందిన బోట్ నంబర్ INDM 49 బోట్‌లో 11 మంది మత్స్యకారులు బయల్దేరారు. వారంతా సుమారు 20 మైళ్ళ దూరం వెళ్ళే సరికి బోట్‌లో నుంచి మంటలు చెలరేగాయి. ఇంజిన్ వద్ద ఉన్న డీజిల్ టాంక్ నుంచి మంటలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున రావడంతో మత్స్యకారులు అంతా ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. చుట్టూ చూస్తే ఎవ్వరూ లేరు. సముద్రంలో దుకినా 20 కిలో మీటర్ల దూరం నుంచి బయట పడడం అసాధ్యం. కళ్లముందే మృత్యువు కనిపిస్తుండటంతో అందరిలోనూ భయం. ఏ దేవుడైనా కాపాడితే బాగుండు అన్నట్టు అందరి దేవుళ్లను మొక్కుతూ ఉన్న సమయంలో ఏ దేవుడు వాళ్ళ మొర ఆలకించారో కానీ వాళ్ళను గమనించిన ఒక బోట్ వాళ్ళ వైపు వేగంగా రావడం కనిపించింది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com