వచ్చే నెల ఎనిమిది లేదా తొమ్మిదో తేదీన విశాఖకు రానున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నాలుగు రోజులపాటు ఇక్కడే ఉంటారని అంటున్నారు. రుషికొండపై నూతనంగా నిర్మించిన క్యాంపు కార్యాలయంలో శాఖల వారీగా సమీక్షలు కూడా నిర్వహిస్తారని సమాచారం. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని ఎక్కడా బయటకు చెప్పడం లేదు. పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం.. న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిపై విశాఖ కేంద్రంగా ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహిస్తారంటూ ఇటీవల ఉత్తర్వులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలు శాఖల కార్యాలయాల కోసం భవనాలను గుర్తించారు. మంత్రులు, ఉన్నతాధికారులకు వసతి కల్పన కోసమూ ఏర్పాట్లు జరుగుతున్నాయి.