టీడీపీతోనే రైతుల సంక్షేమం సాధ్యమని గిద్దలూరు టీడీపీ ఇన్చార్జ్ ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. బాబుష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలోని అంశాలను మహిళలకు, ప్రజలకు వివరించారు. అనంతరం మాట్లాడుతూ..... రైతులకు సంక్షేమ పాలన అందించాల్సిన ప్రభుత్వం విద్యుత్ మోటార్లుకు మీటర్లు ఏర్పాటు చేసి రైతుల మెడకు ఉరితాళ్లు బిగిస్తోందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు సోరెడ్డి మోహన్‌రెడ్డి, పూనూరు భూపాల్‌రెడ్డి, కొండసాని గురువారెడ్డి, యర్రమొద్దు ఈశ్వరరెడ్డి, తమ్మినేని పెద్దిరెడ్డి, కంచర్ల బాలవీరయ్య, దొంతా బయన్న, చిలకల వెంకటరెడ్డి, ఆవుల శ్రీనివాసరెడ్డి, జనసేన నాయకులు ముంతల మధుసుధన్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి లంకా నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.