దళితులను దగా చేసిన ఏకైక సైకో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అని ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి విమర్శించారు. దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని, అథోగతి పాలైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే దార్శినికుడైన చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. బాబు ష్యూరిటీ- భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ..... వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటికి దళితులకు అమలవుతున్నా 27 పథకాలను రద్దుచేశారని మండిపడ్డారు. దళితుల ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చిన తరువాత వారిని నట్టేట ముంచిన ఘనాపాటి అని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంత మంది ఉన్నా ఒక్కొక్కరికీ రూ.15 వేలు ఇస్తామన్నారు. ఆడబిడ్డ నిధి నిధి కింద 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలు ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరికీ నెలకు రూ.1500 చొప్పున టీడీపీ ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేల చొప్పున భృతిని కల్పిస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్, వైసీపీ బనాయిస్తున్న తప్పుడు కేసుల గురించి ప్రజలకు వివరించారు. గత టీడీపీ ప్రభుత్వహయాంలో కాలనీలో అధ్వానంగా ఉన్న మట్టి రోడ్లను సీసీ రోడ్లగా మార్చామని, రామతీర్థం నీటిని అందించామని కాలనీవాసులకు ఎమ్మెల్యే స్వామి గుర్తుచేశారు. అలాగే డప్పు కళాకారులను వృత్తి కళాకారులుగా గుర్తించి పింఛన్లు ఇచ్చామన్నారు. స్థానిక గురుకుల పాఠశాలలో సైన్సు గ్రూపులు తీసుకొస్తే వైసీపీ ప్రభుత్వంలో రద్దుచేసి దళిత విద్యార్థులను విద్యకు దూరం చేసిందన్నారు. ఐదేళ్ల నుంచి కాలనీ అభివృద్ధిని పట్టించుకున్న దిక్కులేదని స్థానికులు ఎమ్మెల్యే ఎదుట వాపోయారు. తాగునీరు కూడా సక్రమంగా రాకపోవటంతో ఇక్కట్లు పడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వేల్పుల సింగయ్య, నేతలు షేక్ సంధానీబాషా, సన్నెబోయిన శ్రీనివాసులు, కూనపరెడ్డి సుబ్బారావు, గాంధీచౌదరి, సుదర్శి చంటి, రామారావు, పులి ప్రసాద్, సైకం చంద్రశేఖర్, గుదే వెంకటేశ్వర్లు, గాలి హరిబాబు, చీమకుర్తి శ్రీకాంత్, సన్నెబోయిన మల్లికార్జున, శ్రీను, నరాల సుధాకర్, వర్మ, కళ్లగుంట నరసింహ, పొనుగోటి బాబురావు, కొటేశ్వరరావు, సుభాషిణి పాల్గొన్నారు.