సామాజిక కార్యకర్త వరవరరావు శస్త్రచికిత్స నిమిత్తం హైదరాబాద్ వెళ్లేందుకు ముంబై కోర్టు అనుమతించింది. ఈ మేరకు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాజేష్ కటారియా ఉత్తర్వులు జారీ చేశారు. ఎడమకంటికి శస్త్ర చికిత్స కోసం డిసెంబర్ 5-11 మధ్య హైదరాబాద్ వెళ్లే అవకాశం ఉందని, డిసెంబర్ 4న తన ప్రయాణ వివరాలను జాతీయ దర్యాప్తు సంస్థకు తెలియజేయాలని.. అలాగే తాను ఉన్న ప్రాంతాన్ని ఇవ్వాలని కోర్టు పేర్కొంది.