ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎపి ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం రైల్వే స్టేడియం నుండి నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ డిల్లీరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించేలా బహిరంగ చర్చ అవసరమని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తోడు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం వలన వ్యాధి గ్రస్తుల సంఖ్య నానాటికీ తగ్గు ముఖం పట్టడం శుభ పరిణామం అన్నారు.