ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్యూసెక్యులు, టీఎంసీలకు తేడా తెలియని మంత్రి అంబటి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 01, 2023, 05:40 PM

అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, సంబంధింత నీటిపారుదల మంత్రి అంబటి రాంబాబు మూలంగానే ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీలో సమస్యలు తలెత్తుతున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరి బాజి చౌదరి  పేర్కొన్నారు. శుక్రవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘క్యూసెక్యులు, టీఎంసీలకు మంత్రి అంబటి రాంబాబుకి తేడా తెలియదన్నారు. తన అసమర్థతను గత పాలకుల మీద మాట్లాడే స్థాయికి మంత్రి అంబటి రాంబాబు దిగజారారని మండిపడ్డారు. అంబటి ఇరిగేషన్ మంత్రిగా ఏరోజైనా ఇరు రాష్ట్రాల నీటి పంపిణీ సమస్యలపై సమీక్ష నిర్వహించారా అని కనుమూరి బాజి చౌదరి ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com