డ్రాఫ్ట్ పబ్లికేషన్ పెండింగ్ అంశాలపై జిల్లా స్థాయి అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ అరుణ్ బాబుతో పాటు జాయింట్ కలెక్టర్ చేతన్, పెనుగొండ సబ్ కలెక్టర్ కార్తిక్, డిఆర్ఓ కొండయ్యలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్నారు. ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ప్రధాన ఎన్నికల అధికారి పలు సూచనలు చేశారు.