గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం కార్తీక మాసం పునర్వసు నక్షత్రం సందర్భంగా అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. వేదపండితులు, అర్చకులు శ్రీ సీతా రామచంద్ర మూర్తులకు అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ పట్టెం గురుప్రసాద్, అధికారులు, వేద పండితులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.