యాడికి మండలంలో పోలీసులు బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. ఎస్సై గురుప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో మమేకమయ్యారు. విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి ఫొక్సో చట్టం, బాల్య వివాహాలు, ర్యాగింగ్ చట్టాలపై అవగాహన కల్పించారు. ఆపద సమయాల్లో వెంటనే డయల్ 100కు సమచారం అందించాలన్నారు.