గుంతకల్లు మండలంలోని 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ, యువకులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని తహశీల్దారు ప్రతాప్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2024 ఓటరు ముసాయిదా విడుదల చేశామన్నారు. ఓటరు జాబితాలో అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు చేయడానికి శని, ఆదివారాల్లో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లు అందుబాటులో ఉంటారన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa