పుట్టపర్తి మండల కేంద్రమైన బుక్కపట్నం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి పరిశీలించారు. శుక్రవారం పాఠశాల ఆవరణంలో రెండవ తరగతి గదిలో ప్రవేశించిన ఆమె విద్యార్థులు రాసిన వర్కు బుక్కులు, నోటు పుస్తకాలను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయుల యొక్క హాజరు పుస్తకాన్ని పరిశీలించారు. వెనుకబడిన విద్యార్థులను బాగా చదివించి రాయించాలని ఉపాధ్యాయులకు సూచించారు.