భారత్-పాకిస్తాన్, భారత్-బంగ్లాదేశ సరిహద్దుల్లో అత్యంత పటిష్టమైన భద్రత కల్పించబోతున్నామని హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత తొమ్మిదేళ్లలో భారత్-పాక్, భారత్-బంగ్లా సరిహద్దుల్లో 560 కిలోమీటర్ల మేర కంచె నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు.
రాబోయే రెండేళ్లలో సరిహద్దుల్లో అసంపూర్తిగా ఉన్న 60 కిలోమీటర్ల మేర కంచె నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు.