ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం కింద నాలుగో విడత నిధులను డిసెంబర్ 7న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
కర్నూలు జిల్లా పర్యటన నేపథ్యంలో సీఎం జగన్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారని తెలుస్తోంది. కాగా, గత ఆగస్టులో 8,44,336 మంది ఖాతాల్లో రూ.680 కోట్లను సీఎం జమ చేసిన సంగతి తెలిసిందే.