గాజాలో మళ్లీ ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. దీంతో ఇప్పటి వరకు 178 మంది పాలస్తీనా ప్రజలు మృతిచెందినట్లు గాజా ఆరోగ్యశాఖ పేర్కొంది. మరోవైపు హమాస్ బందీల్లో ఐదుగురు చనిపోయినట్లు మిలిటెంట్ గ్రూప్ ధ్రువీకరించింది.
అయితే కాల్పుల విరమణ కొనసాగించాలని ఇతర దేశాలు కోరినా వైమానిక దాడులు చోటుచేసుకున్నాయి. ఈ దాడులతో గాజాలో మళ్లీ ఆసుపత్రుల్లో దారుణ పరిస్థితులు ఏర్పడతాయని యూఎన్ ఏజెన్సీలు హెచ్చరికలు జారీ చేశాయి.