ప్రజారోగ్య పరిరక్షణకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ప్రాధాన్యం ఇస్తోందని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. జగ్గంపేట లో ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించిన సందర్భంగా వారు మాట్లాడుతూ నవంబర్ 14 ప్రపంచ మధుమేహ దినోత్సవ నేపథ్యంలో వైద్య శిబిరాలను ప్రారంభించామన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ వారికి వైద్య నిపుణులతో సలహాలు, సూచనలను ఇప్పిస్తున్నామని పేర్కొన్నారు.