ఆ రోడ్డు ఏర్పాటు చేసి నాలుగు నెలలు తిరగకనే రోడ్డుపై గుంతపడింది. దీంతో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటన్నాయి. అయినా జాతీయ రహదారి అధికారులు స్పందించక పోవడంతో స్థానికులు గుంత మధ్యలో చెట్టునాటి రాళ్లు పెట్టారు. రోడ్డు నిర్మించిన నెలకే గుంత పడింది. హిందూపురం నుంచి లేపాక్షికి వెళ్లే రహదారిలో మరువపల్లి వద్ద ఈ గుంత ఏర్పడింది. కొడికొండచెకోపోస్టు నుంచి శిర వరకు 544 ఈ జాతీయ రహదారి నిర్మించారు.