పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువగా తీసుకువెళ్లడమే లక్ష్యమని గుంతకల్ డీఎస్పీ నరసింగప్ప అన్నారు. ఆదివారం బెలుగుప్ప పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసి రికార్డులను స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. లాకప్ గదులు, నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, యాక్సిడెంటల్ జోన్లపై ఆరా తీశారు. శాంతిభద్రతల పర్యవేక్షణే లక్ష్యంగా పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువగా చేసామన్నారు. స్టేషన్ లో ఖాళీగా ఉన్న స్థానాలను పూర్తి చేస్తామన్నారు.