శనివారం అర్ధరాత్రి ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని మిందానాలో రిక్టర్ స్కేల్‌పై 7.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు ఫిలిప్పీన్స్ సిస్మాలజీ ఏజెన్సీ ఫివోల్క్స్ తెలిపింది. భూకంప కారణంగా దక్షిణ జపాన్ తీరానికి సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. పిలిప్పీన్స్ తీరంలోని కొన్ని ప్రాంతాల్లో అలలు 3 మీటర్ల ఎత్తునకు ఎగిసిపడే ప్రమాదం ఉందని అమెరికా సునామీ హెచ్చరికలు వ్యవస్థ అప్రమత్తం చేసింది. ‘ఇప్పటికే సముద్రంలో ఉన్న పడవలు తదుపరి సలహా ఇచ్చే వరకు సముద్రంలో లోతైన నీటిలో ఉండాలి’ అని ఫివోల్స్క్ సూచించింది. అలాగే, సురిగో డెల్ సుర్, డవో ఓరియంటల్ ప్రావిన్సుల తీరంలోని ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించింది. జపాన్ బ్రాడ్‌కాస్టర్ ఎన్‌హెచ్‌కే స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు జపాన్ నైరుతి తీరానికి ఒక మీటరు వరకు సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
భూకంపం వల్ల గణనీయమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఫివోల్క్స్ అంచనా వేసింది. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న తీరప్రాంత పట్టణం హినాటువాన్ స్థానిక పోలీసు చీఫ్ రేమార్క్ గెంటల్లాన్ మాట్లాడుతూ.. భూకంపం సంభవించినప్పటి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. విపత్తు ప్రతిస్పందన బృందాలు ఇంకా ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టాన్ని పర్యవేక్షించలేదని చెప్పారు. రింగ్ ఆఫ్ ఫైర్‌పై ఉన్న ఫిలిప్పీన్స్‌లో భూకంపాలు సర్వసాధారణం. ఇది భూకంప కార్యకలాపాలకు గురయ్యే పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ప్రదక్షిణ చేసే అగ్నిపర్వతాల బెల్ట్. 63 కి.మీ (39 మైళ్లు) లోతులో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. ఫిలిప్పీన్స్ కాలమానం ప్రకారం రాత్రి 10.37 గంటలకు భూకంపం సంభవించిందని, దీని తీవ్రత 7.6గా ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. భూకంప కేంద్రం 32 కి.మీ (20 మైళ్లు) లోతులో ఉందని చెప్పింది.