కూడేరు మండలం ముద్దలాపురం గ్రామానికి చెందిన సిఆర్పిఎఫ్ జవాన్ క్రాంతి కిరణ్ అంత్యక్రియలు ఆదివారం ముద్దలాపురంలో అధికార లాంఛనాలతో జరిగాయి. అస్సాంలో క్రాంతి కిరణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని ముద్దలాపురం గ్రామానికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు క్రాంతి కిరణ్ అంత్యక్రియలు అధికార లాంచనాలతో నిర్వహించారు. ఆయన గౌరవార్థం గాలిలోకి తుపాకులు పేల్చారు.