ఏపీపై మిచౌంగ్ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. రైతులు నష్టం జరగకుండా చూడాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు.
తుఫాను బాధిత ప్రజల కోసం షెల్టర్లు, అవసరమైన ఆహారం అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. పార్టీ కార్యకర్తలు, నేతలు తుఫాను బాధితులకు అండగా నిలవాలని పిలుపు నిచ్చారు.