మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, సురక్షిత ప్రాంతాల్లో క్షేమంగా ఉండాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు తమ ధాన్యాలను భద్రమైన ప్రదేశాలకు తరలించుకోవాలని సూచించారు. అధికారుల సూచనల మేరకు నడుచుకొని ప్రజలు ఈ విపత్కర పరిస్థితిని అధిగమించాలని పేర్కొన్నారు.