ఏపీలో మిచౌంగ్ తుఫాన్ ఆందోళన కలిగిస్తుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పిలుపునిచ్చారు. తుపాను సహాయకచర్యల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.
ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మిచౌంగ్ తుఫాన్ తీవ్రత దృష్ట్యా యువగళం పాదయాత్రకు విరామం ప్రకటించినట్లు స్పష్టం చేశారు.