మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో కృష్ణా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కృష్ణా జిల్లాలోని 7 మండలాల్లో ముందస్తు చర్యలు చేపట్టారు. తుఫాన్ ఎఫెక్ట్ ప్రాంతాల వారి కోసం 57 పునరావాస కేంద్రాలు ఏర్పాటుకు జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మచిలీపట్నం, అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలంక, కోడూరు, బంటుమిల్లి, కృత్తివెన్నులలో తుఫాన్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. 7763 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉన్నట్టు గుర్తించారు.