ఏపీలో మిచౌంగ్ తుపాన్ ముప్పు మంచుకొస్తుండటంతో తాజా పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ గా మాట్లాడారు.
సహాయ, పునరావాస చర్యలు, ముందు జాగ్రత్తలపై అధికారులతో చర్చించి దిశానిర్దేశం చేశారు. సమీక్షలో హోంమంత్రి తానేటి వనిత, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.