శ్రీకాకుళం జిల్లా, పలాస మండలం కైజోల గ్రామంలో ఆదివారం వరి నూర్పిడి చేస్తుండగా ప్రమాదవశాత్తు నుర్పుడి యంత్రంలోకి పడి తాళ పోలయ్య(60) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనతో పొలంలో ఉన్న తోటి రైతులు అతన్ని హుటా హుటిన పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెంది నట్టు గుర్తించారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa