రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సైకో సీఎంని భూస్థాపితం చేద్దామంటూ కళ్యాణదుర్గం టిడిపి ఇంచార్జ్ ఉమామహేశ్వరనాయుడు పిలుపునిచ్చారు. సోమవారం కళ్యాణదుర్గం మునిసిపాలిటీలో 10, 11, 12వ వార్డులలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఆయన ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పతకాలు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా శూన్యంగా మారిందన్నారు.