మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఈరోజు నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖ, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి జిల్లా, కాకినాడ, తూ.గోదావరి, కోనసీమ, ఏలూరు, ప.గోదావరి, నంద్యాల, కడప, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు పడతాయంటున్నారు. బుధవారం విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటున్నారు.