అగ్రిగోల్డ్ బాధితులు బాధితులు పొదుపు చేసుకున్న సొమ్మును ప్రభుత్వం చెల్లించకపోతే ఉద్యమిస్తామని సిపిఐ నియోజకవర్గం కార్యదర్శి వీరభద్ర స్వామి హెచ్చరించారు. సోమవారం గుంతకల్లు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో అగ్రిగోల్డ్ ఏజెన్సీ, సిపిఐ నాయకులు గౌస్, రాము సమావేశం నిర్వహించారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని ఈనెల 7న స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామని అన్నారు.