పెను తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కనిగిరి డివిజన్లో విద్యుత్ శాఖ పూర్తి అప్రమత్తంగా ఉందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పవన్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ కార్యాలయంలో 24 గంటలు పని చేసే కంట్రోల్ రూమ్ కూడా నెలకొల్పామని ఆయన వివరించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినా, లైన్లు తెగిపోయినా, ఇతరత్రా ఏవైనా సమస్యలు ఎదురైనా వెంటనే కనిగిరి విద్యుత్ స్టేషన్ కి సమాచారం అందించాలన్నారు.