ప్రకాశం జిల్లాలో మిచాంగ్ తుఫాను సందర్భంగా నాగులుప్పలపాడు మండలం కనపర్తి పంచాయతీ ఎంఎస్ పట్టపాలెం, చిన్నం గారి పట్టపాలెం సముద్ర తీర ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన అలలు ఉధృతంగా ఎగిసిపడుతున్న నేపద్యంలో మంగళవారం ఉదయం నాగులుప్పలపాడు ఎస్సై హరిబాబు, సుజన్ కుమార్ తీర ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని తెలియజేశారు.