మిచౌంగ్ తుఫాను కారణంగా బలమైన గాలివానలకు సోమవారం రాత్రి గుడ్లూరు- తెట్టు రహదారిలోను, చేవూరు క్రాస్ రోడ్డు, సముద్ర తీర గ్రామం సాలెపేట వద్ద భారీ వృక్షాలు నేలకూలాయి. దాంతో ట్రాఫిక్ స్థంభించి రాత్రి వేళ ప్రయాణికులు గంటల తరబడి తుఫాను వాతావరణంలో చిక్కుకుపోయి వాహనాలలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. సమాచారం అందుకున్న పోలీసులు నేల కూలిన వృక్షాలను తొలగించే పని చేపట్టి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు.