చీరాల మసీదు సెంటర్ లో నిర్మాణంలో ఉన్న కల్వర్టులోనికి మంగళవారం అదుపుతప్పిన ఒక బొలెరో వాహనం దూసుకుపోయింది. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు. వర్షం కారణంగా డ్రైవర్ కు దారి కనిపించకపోవడంతో ఈ ప్రమాదం వాటిల్లిందని స్థానికులు తెలిపారు. ప్రధానమైన ఈ సెంటర్ లో ప్రణాళిక లేకుండా నెలల తరబడి నిర్మాణ పనులు జరుగుతుండడం ప్రజలకు ఇబ్బందికరమే కాకుండా ప్రమాదాలకు కూడా దారితీస్తోందనే విమర్శలు వినవస్తున్నాయి.