ఏపీపై మిచౌంగ్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ తుఫాన్ గంటకు గరిష్ఠంగా 110 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో.. గంటకు 10 కి.మీ. వేగంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి కదులుతోంది.
మంగళవారం మధ్యాహ్నంలోపు చీరాల, బాపట్ల సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ తుఫాన్ మొత్తం 8 జిల్లాలపై ప్రభావం చూపనుంది. ఈ ప్రభావంతో ఇప్పటికే కుండపోత వానలు కురుస్తున్నాయి.