ఏపీలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో తిరుమలలో కురుస్తున్న వర్షాలు, పొగమంచుతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండపై ఉన్న అతిథిగృహాలు, రెండు ఘాట్ రోడ్లు, పాపవినాశనం రోడ్డు, శ్రీవారి మెట్టుమార్గంలో పలుచోట్ల భారీ చెట్లు కూలడంతో రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. పాపవినాశనం, శ్రీవారిమెట్టు, కపిలతీర్థం, జాపాలి మార్గాలను టీటీడీ మూసివేసింది. తిరుమలలోని జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి.