ఎస్ఐ నియామకాల సవాల్ రిట్ పిటిషన్పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఎస్ఐ నియామకాలలో అన్యాయం జరిగిందని అభ్యర్థులు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
గతంలో ఎత్తు అంశంలో అర్హత కలిగిన అభ్యర్థులను తాజా రిక్రూట్మెంట్లో అనర్హులుగా అధికారులు పరిగణించారు. నేడు జడ్జి సమక్షంలో అభ్యర్థుల ఎత్తు కొలిచే ప్రక్రియ జరగనుంది.