నేడు నెల్లూరు-మచిలీపట్నం మధ్య మైచౌంగ్ తుపాను మధ్యాహ్నం లోపు తీరం దాటనుంది. మిచౌంగ్ తుఫాన్ చెన్నై పై విరుచుకుపడుతుంది. ఈ తుపాను ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మైచౌంగ్ తుపాను తమిళనాడు, తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.