రామచంద్రాపురం మండల కేంద్రంలో పచ్చికాపల్లం - తిరుపతి రహదారి పై భారీ మర్రి చెట్టు కూలిపోవడంతో మంగళవారం రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఒకవైపు కుండపోత వర్షం మరోవైపు ఈదురు గాలుల ప్రభావం వల్ల మరి చెట్టును తొలగించడానికి రెవెన్యూ, పోలీస్ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వెదురుకుప్పం శ్రీరంగరాజపురం నుండి తిరుపతి చేరుకోవడానికి ప్రయాణికులు అవస్థలు గురవుతున్నారు.