మిచౌంగ్ తుఫాన్ ఏపీలో బీభత్సం సృష్టిస్తోంది. వైఎస్ఆర్ కడప జిల్లా భాకరాపేటలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌పై ఓ చెట్టు విరిగిపడి దుర్మరణం చెందారు. భాకరాపేట సమీపపంలో మలినేనిపట్నం వద్ద బైక్‌పై కానిస్టేబుల్ సత్యకుమార్ వెళ్తున్నాడు. ఒకవైపు భారీ వర్షం.. మరోవైపు ఈదురుగాలులు వీస్తుండటంతో సత్యకుమార్‌పై చెట్టు విరిగిపడింది. దీంతో అక్కడికక్కడే సత్యకుమార్ మృతి చెందారు. కాగా సత్యకుమార్ 2004వ బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్‌గా గుర్తించారు.