అద్దంకి మండలం అద్దంకి పట్టణంలో బుధవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి వైసిపి ఇన్చార్జ్ బాచిన కృష్ణ చైతన్య పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడని కృష్ణ చైతన్య తెలియజేశారు. అంబేద్కర్ సిద్ధాంతమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.