మిచౌంగ్ తుపాను నేపథ్యంలో పెన్షన్ల పంపిణీ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. మంగళవారంతో పంపిణీ గడువు ముగియగా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పలువురు వలంటీర్లు తుపాను సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
దీంతో పెన్షన్ల పంపిణీ గడువును ప్రభుత్వం ఈరోజు వరకు పొడిగించింది. కాగా ఈ నెలకు సంబంధించి 65.33 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 64 లక్షల మందికి అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa