ఈ ప్రాంతంలో లేని వారిని తీసుకువచ్చి ఇక్కడ ఓటర్లుగా చేర్పించే విధంగా టిడిపి చేస్తోందని ఇది నిబంధనలకు విరుద్దమని శాసనసభ్యుడు మల్లాది విష్ణు తెలియచేశారు. కుట్రపూరితంగా టిడిపి ఇలా చేస్తోందని ఆరోపించారు. ఉద్దేశ్యపూర్వకంగా ఇలా చేయడం రాజ్యాంగ విరుధ్దం అన్నారు. దీనిని ఎన్నికల కమీషన్ అడ్డుకోవాలని కోరారు.అధికారులందరూ అప్రమత్తంగా ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. ఈ రోజు దేవినేని ఉమ, మరికొందరు కలిసి అసందర్భంగా వైయస్సార్ సిపిపై విమర్శలు చేస్తున్నారన్నారు. సజ్జలరామకృష్ణారెడ్డి గారిపై,ధనుంజయరెడ్డిగారిపై విమర్శలు చేసే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేదంటే తగిన బుధ్ది చెబుతామని హెచ్చరించారు.