వైసీపీ చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా మంత్రి గుమ్మనూరు జయరామ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో సామాజిక విప్లవానికి నాంది పలికింది జగనన్న. సామాజిక న్యాయం నినాదం కాదు అమలు చేయాల్సిన విధానమని అధికారంలోకి వచ్చిన మొదటి రోజే చెప్పిన జగనన్న. కనీవినీ ఎరుగని రీతిలో నవరత్నాల్లోని సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లోకి రూ.2.40 లక్షల కోట్లను డీబీటీ ద్వారా జమ చేశారు. ఇందులో 75 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే చేరాయి.ఆ వర్గాల ప్రజలు పేదరికం నుంచి గట్టెక్కి, ఆర్థిక సాధికారత సాధించడానికి బాటలు పడ్డాయి. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.67 లక్షల కోట్ల లబ్ది చేకూరింది. 30 లక్షల మందికి పైగా ఇంటి స్థలాలను ఇచ్చి, పక్కా గృహాలను కడుతూ, పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న సీఎం జగన్. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేలా పథకాలు అందిస్తున్నారు. ఒకటో తేదీ ఉదయాన గడపల దగ్గరే పింఛన్లు అందిస్తూ, అవ్వాతాతల మొహాల్లో వెలుగులు నింపుతున్నారు. మన బడుగు, బలహీన వర్గాలు, పేదలు ఎప్పుడూ బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా.. మళ్లీ జగనన్నే రావాలి అని పిలుపునిచ్చారు.