తెలంగాణలో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేయకుండా ఎన్నికల కమిషన్ కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలని మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డితో కూడిన వైయస్ఆర్సీపీ ప్రతినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్కు విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్లో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేసేందుకు సిద్ధంగా ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.ఈ సందర్భంగా శాసనమండలిలో విప్, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మండిపడ్డారు.మాజీ ఐఏఎస్ అధికారి ముసుగులో అపర మేధావి అయిన రమేష్ కుమార్ సిటిజన్ ఫర్ డెమక్రసీ పేరుతో సంస్ధ పెట్టి కార్యదర్సిగా ఉంటూ ప్రజాస్వామ్య వ్యతిరేకంగా,రాజ్యంగ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.