వైయస్ఆర్‌సీపీ గాని, మా అధ్యక్షులు వైయస్ జగన్ గారు గాని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలనే ధ్యేయంతో ఉన్నామని మల్లాది విష్ణు అన్నారు.ఆ ఓటు కూడా ఓటరు ఎక్కడైతే స్దిర నివాసం ఉంటారో అక్కడే ఉండాలనేది పదే పదే కోరుతున్నామని తెలియచేశారు.ఎన్నికల కమీషన్ కు కూడా మూడుసార్లు మా పార్టీ విధానం ఇది అని చెప్పామని అన్నారు.తెలుగుదేశంకు సంబంధించి చంద్రబాబు ఏపిలోనే కాదు భారతదేశంలో వ్యవస్దలను మేనేజ్ చేయడంలో సిధ్దహస్తుడని అన్నారు.గతంలో చాలాసార్లు చంద్రబాబు గురించి విన్నామని అన్నారు.ఏపిలో నాలుగునెలల్లో ఎన్నికలు జరగబోతుంటే పక్కనున్న తెలంగాణాలో ఎన్నికలు అయిపోయాక తెలుగుదేశం పార్టీ పేరుతో బ్యానర్లు కట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేసి అక్కడ ఉన్న ఓట్లను ఇక్కడ చేర్చే కార్యక్రమం చేపట్టడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఫారం 6 అనేది నూతనంగా ఓటర్లుగా నమోదు చేయడానికి ఉపయోగించేదన్నారు.ఓటర్లు ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతంకు వచ్చినట్లయితే ఫారం 8 ఉపయోగించి దరఖాస్తు చేసుకోవాలి.కాని ఫారం 6 ఉపయోగించి 30 సంవత్సరాల పైబడిన ఓటర్లను టిడిపి నమోదు చేయిస్తోందని అన్నారు. నిజంగా ధైర్యం ఉంటే ఫారం 8 వాడాలన్నారు.ఇదంతా ఓ పధకం ప్రకారం చేస్తోందని అన్నారు.ఇందుకు ఆధారాలను అందచేశామని వివరించారు.