మిచౌంగ్ తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని సీఎం జగన్ ప్రకటించారు. తుపాను ప్రభావంపై ఇవాళ కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.
యుద్ధప్రాతిపదికన విద్యుత్ ను పునరుద్ధరించాలని, వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. చెట్టుమీదపడి మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ.30 లక్షల పరిహారం ప్రకటించారు.