ఏపీలో 'మిచాంగ్' తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. పలు ప్రాంతాల్లో గత 2-3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురవనున్నాయి. దీతో పంటలు మునిగి, వాగులు వంకలు పొంగుతున్నాయి.
ఏపీలో గత 24 గంటల్లో 181.5 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జంగారెడ్డిగూడెం మండలంలో 301.8 మి.మీ వర్షపాతం నమోదవగా.. ముదినేపల్లిలో 92.2 మి.మీ వర్షపాతం నమోదైంది.