స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కేపిటల్ ఇన్వెస్ట్మెంట్ పథకానికి ఏపీ అర్హత పొందలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.
రాజ్యసభలో మంగళవారం బీజేపీ ఎంపీలు నారాయణ కొరగప్ప, జీవీఎల్ నరసింహారావులు అడిగిన వేర్వేరు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ పథకం కింద ఏపీకి 2023-24లో రూ.4,047 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అయితే మార్గదర్శకాలు, నిబంధనలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘించిందన్నారు.