అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన జరిగి నేటికి 31 ఏళ్లు. డిసెంబర్ 6, 1992న, రామజన్మభూమి స్థలంలో బాబ్రీ మసీదు నిర్మించారనే వాదనతో లక్షన్నర మంది కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేశారు.
ఫలితంగా దేశవ్యాప్తంగా మత ఘర్షణలు చెలరేగాయి. హిందువులు, ముస్లింలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ అల్లర్లలో దాదాపు 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో కూడా హిందువులపై ప్రతీకార దాడులు జరిగాయి.