శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం దాదిరెడ్డిపల్లి, దాదిరెడ్డిపల్లి తాండాల్లో ఈగల బెడద ఎక్కువ అయింది. వివరాల మేరకు తండా గ్రామాల్లో కొండల్లో ఉండడంతో అక్కడ పారిశుభ్రత అస్తవ్యస్తంగా ఉన్నాయి. పారిశుభ్ర పనులు సరిగ్గా చేపట్టకపోవడంతో గ్రామాల్లో ఇళ్లల్లో ఈగలు ఎక్కువయ్యాయి. దీంతో ఆ గ్రామాల్లో తరచూ వాంతులు విరేచనాల రోగాల బారిన పడుతున్నారని గ్రామస్తులు వాపోయారు.